ఏపీటీఎఫ్ డైరీ ఆవిష్కరించిన జెడ్పీ చైర్‌పర్సన్
ఒంగోలు సిటీ: ఏపీటీఎఫ్ రాష్ట్ర డైరీని, క్యాలెండర్‌ను జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాకా జనార్దనరెడ్డి, డి.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి లకు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాకా జనార్దనరెడ్డి, డి.శ్రీనివాసులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కార్యదర్శి బి.రఘుబాబు, జిల్లా సబ్ కమిటీ సభ్యులు బి.శేషారావు, పి.శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు కె.రవి, జే.వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు పరిటాల సుబ్బారావు, చీమకుర్తి మండల శాఖ అధ్యక్షుడు యాకోబు, మండల శాఖ బాధ్యులు దాస్, ఆర్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment