![మాట్లాడుతున్న కలెక్టర్ అనురాగ్ జయంతి - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/29/kalektar_mr_0.jpg.webp?itok=uIwP4HEZ)
మాట్లాడుతున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
● కలెక్టర్ అనురాగ్ జయంతి
వేములవాడఅర్బన్: ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లతో ఉపాధి పొందాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ మండలంలోని సంకెపల్లి, రుద్రవరం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం(పీఎంఎఫ్‌ఎంఈ) కింద లబ్ధిదారులు నెలకొల్పిన యూనిట్లను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. సంకెపల్లిలోని ఆయిల్‌మిల్లు, రుద్రవరంలోని పిండిగిర్నీ యూనిట్లను పరిశీలించారు. యూనిట్ స్థాపన లాభదాయకంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. యువత ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని కోరారు. ఒక్కో గ్రామంలో కనీసం రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ స్కీం ద్వారా గరిష్టంగా రూ.10 లక్షలతో వ్యక్తిగత యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే వారికి 35 శాతం రాయితీ, స్వయం సహాయక సంఘాలు, సొసైటీలు గరిష్టంగా రూ.10 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలను స్థాపించవచ్చని తెలిపారు. అనంతరం వేములవాడ మండలం చంద్రగిరి రైతు కడమంచి దుర్గవ్వ ఆయిల్‌ఫామ్ క్షేత్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. డీఆర్డీవో గౌతంరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment