సీఎం సారూ.. ప్రాణభిక్ష పెట్టండి
● వాయిస్ రికార్డులు విడుదల చేసిన బాధితులు ● సిరిసిల్ల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుడితో తమకు ప్రాణాపాయం ఉందని.. సీఎం సారూ ప్రాణభిక్ష పెట్టండని సిరిసిల్లలో సదరు నేత బాధితులు కోరారు. ఓ మహిళతో కాంగ్రెస్ నేత జరిపిన వాయిస్ రికార్డులను శుక్రవారం అంబేడ్కర్ చౌరస్తాలో మీడియాకు వెల్లడించిన సందర్భంగా మాట్లాడారు. అధికా రం, పలుకుబడిని అడ్డుపెట్టుకుని సదరు నేత పేదల భూములను కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఖాళీ భూమి కనిపిస్తే లిటికేషన్ సృష్టించి కబ్జాలు చేస్తున్నాడని ఆరోపించారు. అతని అరాచకాలతో చాలామంది మరణించారని సీఎం రేవంత్‌రెడ్డి ఈవిషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కొందరు వ్యాపారవేత్తల వద్ద మెటీరియల్ తీసుకొని డబ్బులు అడిగితే చంపుతానని గన్‌తో బెదిరించాడన్నారు.
వైరల్‌గా వాయిస్ రికార్డు
బాధితులు ఆరోపించిన సదరు వ్యక్తి ఓ మహిళతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ విప్, కలెక్టర్ తదితరులపై చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చకు దారి తీసింది. తాను ఏదైనా సెటిల్‌మెంట్ కోసం ఒక ఫోన్‌చేస్తే నాలుగు లక్షలు ఇస్తారు అంటూ.. తన వాయిస్ రికార్డు చేస్తున్నావా అంటున్న వ్యాఖ్యలను బాధితులు బయటపెట్టారు. జిల్లా ఉన్నతాధికారులు సదరు నేతపై విచారణ కమిటీ వేసి తమకు న్యాయం చేయాలని బాధితులు భోజనగారి శంకర్, కొప్పు అమృత, మారవేణి దేవలక్ష్మి, ఐత సంతోష్, మహబూబ్, మెట్టపెల్లి ఆంజనేయులు, రాజు, నాంపల్లి, మల్లేశం, బాలరాజు, రాజన్నసిరిసిల్ల జిల్లా ఉద్యమకారులు మారవేణి రంజిత్‌కుమార్ తదితరులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment