![● లోక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07srl07-180076_mr-1738955598-0.jpg.webp?itok=wkxh7m7a)
● లోకంచూడక ముందే కన్నుమూత ● వ్యాక్సిన్ వికటించి ఒక్కరు
సిరిసిల్ల: జిల్లాలోని ధర్మాస్పత్రిలో దారుణాలు జరుగుతున్నాయి. సరైన వైద్యం అందక ప్రాణాలు పో తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు పోలేని పేదలే సర్కార్ ఆస్పత్రులకు వస్తుంటారు. ఉచితంగా వైద్యం అందుతుందనే నమ్మకంతో వస్తారు. కానీ సర్కారు ఆస్పత్రి ప్రసూతి వార్డుల్లో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రసూతి సేవలు పొందిన వారి వద్ద ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే మీకు ఖర్చు అయ్యేది కదా..!? అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడల్లోని స ర్కారు ఆస్పత్రులపై పర్యవేక్షణ లేక.. సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మాతా, శిశు మరణాలు ఉండొద్దంటూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రతి నె లా వైద్యాధికారులతో సమావేశమై దిశనిర్దేశం చేస్తున్నారు. అయితే జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు పసివాళ్ల ప్రాణాలు గాలిలో కలిశాయి.
నిర్లక్ష్యానికి చికిత్స కరువు
సర్కారు ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందిలో అనేక మంది అంకితభావంతో సేవలందిస్తున్నారు. కొందరు సిబ్బంది మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి విధులు నిర్వహించే నిర్లక్ష్యానికి చికిత్స లేకపోవడంతో ఇలాంటి చిన్నారులు లోకాన్ని చూడకముందే కన్నుమూస్తున్నారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందికి ముందుగా చికిత్స చేస్తే.. సర్కారు ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుంది. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది.
ఏఎన్‌ఎంకు మెమో జారీ చేశాం
నేరెళ్లలో పాప మరణించిన సంఘటనలో వ్యాక్సిన్ వేసిన ఏఎన్‌ఎంకు మెమో జారీ చేశాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలకు వ్యాక్సిన్ వేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాక్సిన్ వేసిన తరువాత జాగ్రత్తలు తీసుకోలేదు. పాప అస్వస్థతకు గురైన విషయాన్ని మా దృష్టికి తేకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించాం.
– ఎస్.రజిత, జిల్లా వైద్యాధికారి
![● లోకంచూడక ముందే కన్నుమూత ● వ్యాక్సిన్ వికటించి ఒక్కరు1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07srl11-180076_mr-1738955598-1.jpg)
● లోకంచూడక ముందే కన్నుమూత ● వ్యాక్సిన్ వికటించి ఒక్కరు
Comments
Please login to add a commentAdd a comment