![చికెన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07srl05-180076_mr-1738955597-0.jpg.webp?itok=dNe-FZ5p)
చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
● జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి
సిరిసిల్ల: చికెన్, కోడిగుడ్లపై వదంతులు నమ్మొద్దని, జిల్లాలో కోళ్ల మరణాలు లేవని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వి.రవీందర్‌రెడ్డి తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఆఫీస్‌లో పశువైద్యాధికారులు అంజిరెడ్డి, అభిలాష్‌లతో కలిసి శుక్రవారం మాట్లాడారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైరస్ బారిన పడి లేయర్ కోళ్లు మరణిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈనేపథ్యంలోనే జిల్లాలోని 97 బ్రాయిలర్, 28 లేయర్ కోళ్ల ఫారాలను పశువైద్యులు పరిశీలించారని, ఎలాంటి మరణాలు లేవని స్పష్టం చేశారు. చికెన్, కోడిగుడ్లను ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చని తెలిపారు.
నేతన్నలు దురలవాట్లకు దూరంగా ఉండాలి
● సైకాలజిస్ట్ కె.పున్నంచందర్
సిరిసిల్ల: నేతన్నలు దురలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ కోరారు. స్థానిక బీవైనగర్‌లో శుక్రవారం మైండ్‌కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేతకార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. తంబాకు తినడం, సిగరెట్ తాగడం, అతిగా టీలు తాగడం ద్వారా క్యాన్సర్, జీర్ణకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. నిద్ర సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు వస్తే వెంటనే కౌన్సిలింగ్ తీసుకోవాలని కోరారు. ‘హ్యాండ్ అవుట్స్ స్లిప్పుల’ను నేతకార్మికులకు అందించారు. స్థానిక వస్త్రోత్పత్తిదారులు హన్మాండ్ల రామనారాయణ, మనోవికాస కేంద్ర సిబ్బంది వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత పాల్గొన్నారు.
కార్మికులను ఇబ్బందులు పెట్టొద్దు
బోయినపల్లి(వేములవాడ): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 44 కార్మికచట్టాలను రద్దు చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో భవన నిర్మాణ కార్మిక సంఘం మూడో మహాసభ కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. వివాహాలకు, డెలివరీలకు సాయం పెంచాలని కోరారు. 55 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. రామంచ అశోక్, నల్గొండ రాజు, రవి, బొడ్డు రాజలింగం, తాహిర్ ఉన్నారు.
ఆరోగ్య కేంద్రాలు తనిఖీ
ముస్తాబాద్(సిరిసిల్ల): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను వందశాతం సాధించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆవునూర్, నామాపూర్, గూడెం సబ్‌సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ ఎన్‌సీడీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈనెల 10న నట్టల నివారణ మందుల పంపిణీను సక్రమంగా చేపట్టాలని సూచించారు. ముస్తాబాద్‌లో తిరుమల నర్సింగ్ హోమ్‌లో రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి గీతాంజలి, సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
![చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07srl79-180052_mr-1738955597-1.jpg)
చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
![చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07srl03-180076_mr-1738955597-2.jpg)
చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
![చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
3](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07vmd127-180083_mr-1738955597-3.jpg)
చికెన్, గుడ్లపై వదంతులు నమ్మొద్దు
Comments
Please login to add a commentAdd a comment