No Headline
ఈ చిత్రంలో రోడ్డెక్కిన వారు జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన రాగళ్ల రాధ–రాజమౌళి దంపతులు. ప్రసూతి వైద్యం కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరగా పాప జన్మించింది. మూడు రోజుల తర్వాత పాప పరిస్థితి బాగా లేదని కరీంనగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. పాప చికిత్స పొందుతూ పుట్టిన వారం రోజులకే మరణించింది. సర్కారు ఆస్పత్రిలో సరైన వైద్యం అందకే పాప మరణించిందని రాజమౌళి–రాధ దంపతులు కన్నీటి పర్యంతమవుతూ రోడ్డెక్కారు. ఇలా బైఠాయిస్తే కేసు అవుతుందని పోలీసులు సముదాయించి ఇంటికి పంపించారు. చేతిలో డబ్బులు లేక, ప్రైవేటులో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని దురదృష్టాన్ని నిందించుకుంటూ బరువెక్కిన హృదయాలతో ఆ తల్లిదండ్రులు ఇంటిబాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment