![వస్త్రోత్పత్తులు ఎగుమతి చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07srl01-180076_mr-1738955598-0.jpg.webp?itok=rDLyxQyv)
వస్త్రోత్పత్తులు ఎగుమతి చేయాలి
సిరిసిల్ల: జిల్లాలోని వస్త్రోత్పత్తులు, పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లా నుంచి ఎగుమతి చేసేందుకు అవకాశమున్న ఉత్పత్తులపై దృష్టిసారించి, ప్రోత్సహించాలన్నారు. నాబార్డ్, ఎంఎస్‌ఎంఈ, జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ పాల ఉత్పత్తులు, సిరిసిల్ల బ్రాండ్‌తో వస్త్రాలు తయారు చేసే ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న ఎఫ్‌పీవోలకు ఎక్కువ మార్కెటింగ్ అందేలా చూడాలన్నారు. టెక్స్‌టైల్ రంగంలో డిమాండ్ ఎక్కడ ఉంది, ఎలాంటి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతి చేయవచ్చు వంటి వివరాలు పరిశీలించాలని సూచించారు. వస్త్రోత్పత్తిదారులు, కార్మికులతో రెగ్యులర్‌గా సమావేశాలు, ట్రెయినింగ్‌లు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. మన దగ్గర యూనిక్ సేలింగ్ పాయింట్ ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న బీఎంసీ నడిచేలా చూడాలని తెలిపారు. పాడిరైతులతో సంప్రదింపులు జరిపి మన దగ్గర పాలు పోసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పరిశ్రమల శాఖ ఫారిన్ ట్రేడ్స్ అదనపు డైరెక్టర్ జనరల్ పర్సనల్ సెక్రటరీ కేవీఎస్ శైలజా, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ సాగర్, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ మల్లికార్జున్, పరిశ్రమలశాఖ అధికారి హన్మంతు, ఏడీ భారతి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, టెక్స్‌టైల్ పార్క్ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్‌కుమార్ ఉన్నారు.
సిరిసిల్ల బ్రాండ్‌ను ప్రోత్సహించాలి
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
Comments
Please login to add a commentAdd a comment