![పాపం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07srl10-180076_mr-1738955599-0.jpg.webp?itok=1lr9cqmt)
పాపం పసివాళ్లు
ముద్దుగా ఉన్న ఈ పసిపాప 45 రోజల వయస్సు ఉన్న దాసరి శివాని. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన దాసరి లలిత–రమేశ్ దంపతుల కూతురు. నేరేళ్ల పీహెచ్‌సీ సిబ్బంది పిలుపుతో పాప తల్లి టీకా వేయించింది. చిన్నారిని తల్లి ఇంటికి తీసుకొచ్చి నిద్రపుచ్చింది. అయితే పాప ఎంతకీ లేవకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా.. అప్పటికే శివాని మరణించిందని నిర్ధారించారు. వ్యాక్సిన్ వేయకుంటే పాప బతికేదని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు.
నేరెళ్ల పీహెచ్‌సీలో వ్యాక్సిన్ వికటించి మరణించిన ఘటనలో బాధిత కుటుంబానికి సంఘటన రోజు రూ.లక్ష చెక్కును సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి అందించారు. మరుసటి రోజు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మరో రూ.లక్ష చెక్కును పాప తండ్రి రమేశ్‌కు అందించారు. సర్కారు ఆస్పత్రిలో వ్యాక్సిన్ వికటించడంతో మరణించిన పాప కుటుంబం ఆందోళన చేస్తే రూ.2 లక్షలు పరిహారంగా అందించారు. కానీ సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందక మరణించిన వారం రోజుల పసిపాప కుటుంబానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు.
![పాపం పసివాళ్లు1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07srl06-180076_mr-1738955599-1.jpg)
పాపం పసివాళ్లు
Comments
Please login to add a commentAdd a comment