సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాకు తొలిసారిగా సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. వేములవాడకు ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఎస్పీ అఖిల్‌మహాజన్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడలో హెలీప్యాడ్ సిద్ధం చేయాలని ఆర్అండ్ బీ అధికారులకు సూచించారు. సభ ప్రాంగణంలో షామియానా, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బహిరంగ సభ కోసం బస్సులు సమకూర్చాలన్నారు. గెస్ట్‌హౌస్‌లో వసతులు, శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా..
పోలీస్‌శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవోలు రాజేశ్వర్, వెంకట ఉపేందర్‌రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ బాపురెడ్డి, డీఎంహెచ్‌వో వసంతరావు, సీపీవో శ్రీనివాసాచారి, కమిషనర్లు లావణ్య, అన్వేశ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment