నేతన్న బీమా విడుదలకు కృషి
సిరిసిల్లకల్చరల్: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుడు దూస గణేశ్‌కు రావాల్సిన బీమా డబ్బులు విడుదలయ్యేందుకు కృషి చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ అదనపు సంచాలకుడు సాగర్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో గణేశ్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. మరమగ్గాల కార్మికుడిగా పట్టణంలోని శ్రీరామ్ విష్ణు దగ్గర పనిచేసే గణేశ్ తన అవసరాల నిమిత్తం రూ.5లక్షలు అప్పు చేశాడని, అప్పులు ఇచ్చిన వారు వేధించడంతో శుక్రవారం ఉదయం తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. స్థానిక నేత గుండ్లపెల్లి పూర్ణచందర్, సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు ఉన్నారు.
‘అసైన్డ్ భూములు మింగిన వారికి శిక్ష తప్పదు’
ముస్తాబాద్(సిరిసిల్ల): అసైన్డ్ భూములను మింగిన వారికి శిక్ష తప్పదని కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కో–కన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి హెచ్చరించారు. ముస్తాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ధరణిని అడ్డం పెట్టుకొని ఎస్సీలకు చెందిన వేలాది ఎకరాలను కొందరు బీఆర్‌ఎస్ నాయకులు పట్టాలు చేయించుకున్నారని ఆరో పించారు. అక్రమార్గంలో అసైన్డ్ భూములు పొందిన వారికి చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారన్నారు. ప్రజ ల కోసం పనిచేస్తున్న కలెక్టర్‌ను అహంకార పూరితంగా దూషించిన కేటీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గెలిచిన రంజాన్ నరేశ్‌ను స న్మానించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్‌రావు, తలారి నర్సింలు, ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య, ప్యాక్స్ డైరెక్టర్ దేవేందర్, కనమేని శ్రీనివాస్‌రెడ్డి, వేణు, శాదుల్, మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సిరిసిల్ల వాసికి ‘అతి విశిష్ట’ పురస్కారం
సిరిసిల్లటౌన్: రైల్వేశాఖ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం సిరిసిల్ల వాసికి దక్కింది. స్థానిక గాంధీనగర్‌కు చెందిన కామారపు వినోద్ రైల్వేశాఖలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హసన్‌పర్తి నుంచి వరంగల్ వరకు భూగర్భ సొరంగమార్గంలో విద్యుత్ పనులు త్వరగా పూర్తిచేశారు. 2023–24లో ఉప్పల్ నుంచి హసన్‌పర్తి, వరంగల్ నుంచి చింతలపల్లి వరకు 61.546 కి.మీ విద్యుద్ధీకరణ పూర్తి చేశారు. దీంతో రైల్వేశాఖ అతి విశిష్ట రైల్ సేవ పురస్కారాన్ని ఈనెల 21 ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా అందజేయనుంది.
వినూత్న నిరసన
సిరిసిల్లటౌన్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శుక్రవారం 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వినూత్నంగా సోది చెబుతూ నిరసన తెలిపారు. ‘సోది అమ్మగా’ రుద్రంగి సీఆర్పీ శ్రీవాణి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ చెప్పడం ఆకట్టుకుంది.
జీపీ అధికారులపై విచారణకు ఆదేశం
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ స్పెషలాఫీసర్, పంచాయతీ కార్యదర్శి ఈనెల 23న జీపీలో జరిగే విచారణకు హాజరుకావాలని జెడ్పీ సీఈవో శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. గ్రామపంచాయతీ సఫాయి సిబ్బందికి డ్రెస్ కొనుగోలు కోసం గత ఆగస్టులో రూ.1.93లక్షలు పంచాయతీ జీరో అకౌంట్ నుంచి డ్రా చేశారని, డ్రెస్సులు కొని సిబ్బందికి ఇవ్వలేదని అంబేడ్కర్ సేవా రత్న, జాతీయ అవార్డు గ్రహీత మంగళి చంద్రమౌళి రెండు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో విచారణ చేపట్టాలని జెడ్పీ సీఈవోను కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment