కుమ్మరికుంట కబ్జా
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొలనూర్‌లో చెరువు కబ్జాకు గురవుతోంది. కోనరావుపేట మండలం కొలనూర్‌లోని బీసీకాలనీ శివారులో సర్వే నంబర్ 416, 417లో కుమ్మరికుంట ఉంది. పురాతన కాలం నుంచి యాదవుల పేరిట ఉన్న ఈ కుంటలో 2002లో రజకసంఘానికి దోబీఘాట్లు నిర్మించి ఇచ్చారు. కొన్నేళ్లుగా వారు దోబీఘాట్లను వినియోగించకపోవడంతో అవి శిథిలమయ్యాయి. కొన్నేళ్లుగా అలాగే ఉన్న ఈ చెరువులో కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి చెరువులో కొంతభాగాన్ని చదును చేశారు. ఈ చెరువు తమదేనంటూ రజక సంఘం ఆధ్వర్యంలో హద్దులు పాతారు. కాగా ఈ కుమ్మరికుంట సుమారు 4 ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం 20 గుంటలకే పరిమితమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా డీటీ, ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి హద్దురాళ్లను తొలగించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు హద్దురాళ్లు అలాగే ఉన్నాయి. తమ గ్రామానికి చెందిన కుమ్మరికుంట చెరువును కాపాడాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment