కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం
● తప్పులను ప్రశ్నిస్తే అరెస్టులు ● నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు దిగజారుడు రాజకీయాలు చేస్తోందని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ఆరోపించారు. సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. కేటీఆర్ ఒక విద్యావేత్తగా హైదరాబాద్‌లో ప్రజలకు ఈ రేసింగ్ పరిచయం చేశారన్నారు. కేటీఆర్ మీద పెట్టిన కేసు కుట్రపూరితమైందని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ది రాచరిక పాలన అన్న మీరూ.. చేస్తుందని నియంత పోకడ కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే బీఆర్‌ఎస్ గొంతుకలను జైలులో వేస్తున్నారన్నారు. ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్రానికి దొరికిన దరిద్ర సీఎం
రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి దొరికిన దరిద్ర ముఖ్యమంత్రిగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అభివర్ణించారు. డబ్బుల సంచులతో దొరికిన వ్యక్తి ఇతరులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెల్లారి లేస్తే బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్, కేటీఆర్‌లపై దుర్భాషలాడడం తప్ప చేసేదేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎప్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, బొల్లి రామ్మోహన్, దిడ్డి రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment