సిరిసిల్లటౌన్: సీఎం కప్–2024 జిల్లాస్థాయి పోటీలు శుక్రవారం సిరిసిల్లలోని మినీస్టేడియంలో నిర్వహించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, యోగా, చెస్, కిక్‌బాక్సింగ్, ఉషు, జూడో, టేబుల్‌టెన్నిస్, క్యారంబోర్డ్, కరాటే, పవర్‌లిఫ్టింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, ఆర్టికల్చర్ ఆఫీసర్ కె.ఆర్.లత, ఫిషరీస్ ఆఫీసర్ సౌజన్య హాజరై విజేతలకు బహుమతులు అందించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రామదాసు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment