చందుర్తి–మేడిపల్లి రోడ్డుకు మోక్షం
● ఎట్టకేలకు అటవీశాఖ అనుమతి
చందుర్తి(వేములవాడ): రెండు జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో తారురోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు అటవీశాఖ నుంచి అనుమతులు లభించాయి. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల సరిహద్దు చందుర్తి–మోత్కురావుపేట గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో 3.450 కిలోమీటర్ల దూరం రోడ్డు వేసేందుకు అటవీశాఖ అనుమతి లభించక దశాబ్ద కాలంగా వేచిచూస్తున్నారు. రూ.19.75కోట్లు మంజూరుకాగా 10 కిలోమీటర్లకుపైగా తారు రోడ్డు నిర్మాణమైంది. మిగిలిన 3.450 కిలోమీటర్ల దూరం అనుమతికి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన కృషితో అనుమతులు లభించాయి. ఈ రోడ్డు పూర్తయితే రెండు జిల్లాల ప్రజలకు దూరభారం తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment