చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాలు.. మండలంలోని పెద్దలింగాపురం గ్రామానికి చెందిన బండ గాలవ్వ(80) ఏడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. అనారోగ్యం భరించలేక సోమవారం వేకువజామున తన వద్ద ఉన్న బీపీ గోలీలు, గుండెకు సంబంధించిన గోలీలు అధికంగా మింగడం వల్ల వాంతులు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె కొడుకు వెంటనే సిద్ధిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు రామచంద్రం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
మల్యాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందింది. మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన నాగుల మొండయ్య, నర్సవ్వ భార్యాభర్తలు. 20 రోజుల క్రితం ఇద్దరూ కలిసి కొండగట్టుకు వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నర్సవ్వ (60) కోమాలోకి వెళ్లింది. కరీంనగర్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment