నివాసం లేని వారి ఇళ్లు రద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని కేీ సఆర్ ఆత్మగౌరవ సముదాయం(డబుల్ బెడ్రూం)లో ఇళ్ల పట్టాలు తీసుకొ ని, నివాసం ఉండని వారి ఇళ్లను రద్దు చేయాలని అ ధికారులు నిర్ణయించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. మండల కేంద్రం శివారులోని డబుల్ బెడ్‌డ్రూం కాలనీలో 167 ఇళ్లను నిరుపేదలకు గత ప్రభుత్వం అందజేసింది. అయితే అందులో దాదాపు 22 మంది ఇళ్లకు తాళాలు వేసి వేరే చోట నివాసం ఉంటున్నట్లు గ్రామపంచాయతీ, మండల స్థాయి అధికారులు ఇటీవల తనిఖీ చేసి గుర్తించారు. కొంతమంది తమకు వచ్చిన ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. గ్రామసభకు హాజరుకావాలని ఇళ్ల లబ్ధిదారులకు నోటీస్ ఇచ్చినా.. వారు మంగళవారం నాటి సభకు రాలేదు. దీంతో అధికారులు స్థానికంగా ఉండని వారి జాబితాను సిద్ధం చేసి ఇళ్లను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో డీటీ సత్యనారాయణ, ఆర్‌ఐ శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment