● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
రైతుల సంఖ్యకు అనుగుణంగా సంఘాలు
సిరిసిల్లకల్చరల్: జిల్లాలోని రైతుల సంఖ్యకు అనుగుణంగా పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు)లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీపకుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకం సహకార్స్ సమృద్ధిపై అదనపు కలెక్టర్ భీమ్యానాయక్, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా నాబార్డ్ డీడీ ఎం దిలీప్ పథకం గురించి వివరించారు. జిల్లాలో మొత్తం 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయని, రైతులకు సంబంధించి అన్ని సేవలనూ సంఘాల్లోనే మరింత మెరుగ్గా అందేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, డీఆర్డీవో శేషాద్రి, వ్యవసాయ అధికారి ఆఫ్జల్‌బేగం, ఉద్యానవన అధికారి వసంతలక్ష్మి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ రజిత, మత్స్యశాఖ అధికారి సౌజన్య, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, విజయ డెయిరీ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment