● విప్ ఆది శ్రీనివాస్
అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
సిరిసిల్లకల్చరల్: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్‌లో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా స్పందించడం లేదని బీజేపీ తీరును దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిరసనలతో కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి ఈ విషయాన్ని నివేదించనున్నట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల వారికి దైవ సమానుడైన అంబేడ్కర్ గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడిపై అమిత్‌షా అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దేశ సంపదను బీజేపీ అంబానీ, అదానీలకు దోచి పెడుతోందని ఆరోపించారు. మణిపూర్‌లో హక్కులు కోల్పోతున్న ప్రజల గురించి పట్టించుకోని మోదీ, అమిత్‌షా అంబేడ్కర్‌పై నోరు పారేసుకుంటున్నారని, ఇప్పటికై నా అమిత్‌షాను మోదీ వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment