వాజ్‌పేయ్‌కి నివాళి
వేములవాడ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ విలువలతో కూడిన రాజకీయవేత్త అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కొనియాడారు. వాజ్‌పేయ్ శతజయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, నాయకులు బండ మల్లేశం, పిన్నింటి హన్మండ్లు, అక్కపెళ్లి వివేక్‌రెడ్డి, గుడిసె మనోజ్, రేగుల రాజకుమార్, నామాల శేఖర్, బిల్ల కృష్ణ, నేరెళ్ల సాయికుమార్, మామిండ్ల లక్ష్మీరాజం, రేగుల శ్రీకాంత్, రాజశేఖర్, సగ్గు రాహుల్, నగేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment