సింగసముద్రం నీటి విడుదల
● 1600 ఎకరాలకు అందనున్న సాగునీరు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ శివారులోని రైతుల వరప్రదాయని సింగసముద్రం ఆయకట్టుకు బుధవారం నీటిని విడుదల చేశారు. మండలంలోని నారాయణపూర్, సర్వాయిపల్లి, రాచర్లబొప్పాపూర్, కోరుట్లపేట, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లోని 1600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిని విడుదల చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో కాల్వల పూడికతీత పనులు చేపట్టారు. సింగసముద్రంలో 24 ఫీట్ల వరకు నీరు నిల్వ ఉందని, ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాల్‌రాజ్, మాజీ సర్పంచులు కొండాపురం బాల్‌రెడ్డి, నేవూరి వెంకట్‌రెడ్డి, మేడిపల్లి దేవానందం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు గౌస్, రాంరెడ్డి, మెండే శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్, రవీందర్‌రెడ్డి, చల్ల మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
సింగసముద్రం నీటిని విడుదల చేయడానికి వెళ్లిన బాద రాములు అనే వీఆర్వో సముద్రం తూం వద్ద కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లి కాలుజారీ పడిపోతుండగా, పక్కనే ఉన్న కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గౌస్ పట్టుకొని ఒడ్డుకు చేర్చాడు. రాములు సముద్రంలో పడిపోకుండా కాపాడిన గౌస్‌ను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment