రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించండి | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించండి

Published Thu, Dec 26 2024 12:53 AM | Last Updated on Thu, Dec 26 2024 12:53 AM

-

సిరిసిల్లకల్చరల్‌: సిరిసిల్లలో నిరుపేదలకు ప్ర భుత్వం ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించాలని సీపీఐ జిల్లా నేతలు కోరారు. కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డికి బు ధవారం వినతిపత్రం అందించారు. మూషం రమేశ్‌ మాట్లాడుతూ దశాబ్దాలుగా నివేశన స్థ లాలున్నా రిజిస్ట్రేషన్‌ హక్కులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కోడం రమణ, అన్నల్‌దాస్‌ గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌స్కూల్‌ ప్రవేశాల గడువు పెంపు

సిరిసిల్లఎడ్యుకేషన్‌: ఓపెన్‌స్కూల్‌లో టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాల గడువు ఈనెల 30 వరకు పొ డగించినట్లు సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేట ర్‌ నాగేశ్వర్‌రావు బుధవారం ప్రకటనలో తెలి పారు. జిల్లాలోని అభ్యర్థులు ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. పదోతరగతిలో ప్రవేశాలకు గతంలో విద్యనభ్యశించిన పాఠశాల నుంచి టీసీ, రికా ర్డుషీట్‌, కులసర్టిఫికెట్‌ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఇంటర్‌లో చేరే వారు పదోతరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణపత్రం సమర్పించాలని తెలిపారు. ఇప్పటి వరకు స్కూల్‌కు వెళ్లని వారు సైతం పదోతరగతిలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, జిల్లాలోని అధ్యయన కేంద్రాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు.

చలో హైదరాబాద్‌కు మద్దతు

సిరిసిల్లఎడ్యుకేషన్‌: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యల పరిష్కారానికి పక్షం రోజులుగా సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం చేపట్టే చలో హైదరాబాద్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న దానిని పాలకులు పక్కకు పెట్టడం సరికాదన్నారు. వెట్టిచాకిరీగా విధులు చేయించుకోవడం అన్యాయమన్నారు.

భూమి కేసులో ఒకరికి లుకౌట్‌

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన దోమకొండ రాజవ్వ 2022లో తన భూమి విషయంలో స్థానిక పోలీ స్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. మల్లారెడ్డిపేటకు చెందిన కర్రె చందు ఏ–7 ముద్దాయిగా ఉన్నాడని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. కేసు పెండింగ్‌లో ఉండగా.. చందు దుబాయ్‌ వెళ్లాడని తెలిపారు. అతనిపై లుకౌట్‌ నోటీసు జారీ చేసి.. దుబాయ్‌ నుంచి తిరిగి వస్తుండగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసినట్లు తెలిపారు. పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించి చందును రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చెప్పారు.

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

సిరిసిల్లఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం కప్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం భాగ్యరేఖ తెలిపారు. ఖోఖోలో కె.జస్వంత్‌, బాలికల విభాగంలో లక్ష్మీప్రసన్న, ఫుట్‌బాల్‌లో వివేక్‌ ఎంపికై నట్లు వివరించారు. ఎంపికై న వారు ఈనెల 29 నుంచి జనవరి 2 వరకు వరంగల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

వినతిపత్రం ఇస్తున్న సీపీఐ నేతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement