ఉత్సాహంగా జిల్లా స్థాయి జూడో పోటీలు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం జిల్లాస్థాయి జూడో పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన సుమారు వంద మంది పోటీల్లో పాల్గొన్నారు. సబ్ జూనియర్ నేషనల్ క్యాడెట్ జూడో, సీనియర్ పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ప్రతిభ కనబర్చిన సుమారు 20 మంది క్రీడాకారులు ఈ నెల 29, 30వ తేదీలలో కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాసారపు తిరుపతి, ప్రధానకార్యదర్శి తిప్పారపు సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై పృథ్వీధర్‌గౌడ్, ఎనదేవి ప్రసాద్, సీహెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment