ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి కృషిచేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, గోదాగోష్టి సభ్యులు 100 మంది వేములవాడలో ఆది శ్రీనివాస్‌ను కలిశారు. జనవరి 12న జరిగే గోదారంగనాథుల కల్యాణానికి రావాలని ఆహ్వానించారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి మంజూరైన రూ.3కోట్లు రావడం లేదనడంతో వెంటనే టీటీడీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి నుంచి ఆలయ కమిటీ సభ్యులు మామిడిపల్లి, మల్కపేటల్లోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్‌చైర్మన్ గంట వెంకటేశ్‌గౌడ్, గోదాగోష్టి సభ్యులు పాల్గొన్నారు.
శతజయంతి సభలు జయప్రదం చేయండి
● సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు
సిరిసిల్లటౌన్: సీపీఐ శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్లలోని సీపీఐ భవనంలో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ప్రధానంగా 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్ర నెమరువేసుకొని భవిష్యత్ పోరాటాలను రూపకల్పన చేసుకోవడం కోసం భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంద సుదర్శన్, సోమ నాగరాజు పాల్గొన్నారు.
చేనేత ఐక్య వేదిక రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మహేశ్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా తంగళ్లపల్లికి చెందిన పద్మశాలీ యూత్ నాయకుడు అంకారపు మహేశ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి చేనేత ఐక్యవేదిక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. పద్మశాలీల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని మహేశ్ పేర్కొన్నారు.
ఈజీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సావిత్రి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన కుర్ర సావిత్రి ఎన్నికయ్యారు. ఎరుకల సామాజికవర్గంలోని పేదలకు అండగా ఉండేందుకు ఏకలవ్య గ్లోబల్ ఫేడరేషన్ పనిచేస్తుందని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేని వారికి ఈజీఎఫ్ అండగా ఉంటుందన్నారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మోడల్‌స్కూల్ సెకండియర్ విద్యార్థి జి.అభిలాశ్ ఖోఖో పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కె.అశోక్ తెలిపారు. ఈనెల 18న జిల్లాస్థాయి పోటీలో ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.
సెమీ కండక్టర్ల తయారీలో శిక్షణ
వేములవాడఅర్బన్: భవిష్యత్‌లో సెమీకండక్టర్ల పాత్ర కీలకం కానుందని వేములవాడ మండలం అగ్రహారం కళాశాల ప్రిన్సిపాల్ టి.శంకర్ తెలిపారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ సహకారంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సెమీకండక్టర్ల తయారీలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎన్‌ఎస్‌డీసీ ద్వారా సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. ఇంటర్, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ పీజీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.కృష్ణప్రసాద్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment