● ‘డబుల్’ ఇళ్లలో ఉండని వారికి అధికారుల షాక్ ● జిల్లా
ఇది ఎల్లారెడ్డిపేట శివారులోని కేసీఆర్‌నగర్‌లో గల డబుల్ బెడ్‌రూమ్ సముదాయంలో తాళం వేసి ఉన్న ఇల్లు. అన్ని అర్హతలు ఉండడంతో అధికారులు ఇంటిని కేటాయించారు. అయితే ఇంటిని తీసుకున్న లబ్ధిదారుడు తాళం వేసి స్థానికంగా ఉండడం లేదు. ఇలాంటి వారు ఈ సముదాయంలో 32 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నివాసం ఉండకుంటే ఇళ్ల యాజమాన్యహక్కులను రద్దు చేస్తామని అధికారులు నోటీస్‌లు జారీ చేశారు. అధికారుల నిర్ణయం లబ్ధిదారులకు షాక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితి రాజన్నసిరిసిల్ల జిల్లాలో 385 మంది లబ్ధిదారులు సైతం తమకు కేటాయించిన ఇళ్లలో ఉండడం లేదని అధికారులు వారి తనిఖీల్లో తేల్చారు. అలాంటి వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment