ఉంటేనే ఇల్లు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిరుపేదల సొంతింటి కల నిజం చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూమ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామపంచాయతీల్లో అధికారులు పలుమార్లు గ్రామసభలు నిర్వహించి.. అన్ని అర్హతలు ఉన్న వారినే అర్హులుగా గుర్తించారు. అయితే గ్రామానికి మంజూరైన ఇళ్లు తక్కువగా ఉండడం.. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,357 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందజేశారు. అయితే ఇళ్లు పొందిన వారిలో చాలా మంది స్థానికంగా ఉండడం లేదని ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీ చేయగా నిజమేనని తేలింది. దీంతో స్థానికంగా ఉండని వారి ఓనర్‌షిప్‌ను రద్దు చేసి మరో అర్హుడికి ఇల్లు ఇవ్వాలని గ్రామపంచాయతీల్లో తీర్మానిస్తున్నారు.
డబుల్ ఇళ్ల సమాచారం
నిధులు : రూ.189.81 కోట్లు
మంజూరైన ఇళ్లు : 6,886
పూర్తయిన ఇళ్లు : 3,653
ప్రారంభంకానివి : 2,607
లబ్ధిదారులకు అందజేసినవి : 3,357
Comments
Please login to add a commentAdd a comment