● ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్‌లో ఇళ్లు పొందిన పలువురు స్థానికంగా ఉండడం లేదని అధికారులకు ఫిర్యాదులు అందాయి. గతంలోనే ముస్తాబాద్‌లో అధికారులు తనిఖీ చేసి 18 మంది స్థానికంగా ఉండడం లేదని గుర్తించారు. వారికి నోటీస్‌లు అందజేయడంతో లబ్ధిదారులు వెంటనే అధికారులను కలిసి స్థానికంగానే ఉంటామని, బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లామని తమ ఇళ్లను రద్దు చేయొద్దని విన్నవించుకున్నారు. దీంతో అధికారులు మొదటి హెచ్చరిక కింద పరిగణిస్తూ వారిని నివాసం ఉండేందుకు అనుమతించారు.
● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేసీఆర్‌నగర్ కాలనీలో 14 బ్లాకులలో 167 మందికి ఇళ్లు కేటాయించారు. అయితే ఇటీవల అధికారులు చేపట్టిన తనిఖీల్లో 22 మంది స్థానికంగా ఉండడం లేదని, తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. తర్వాత గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభకు రావాల్సిందిగా నోటీస్‌లు అందజేసినా లబ్ధిదారులు హాజరుకాలేదు. ఆ సమావేశంలో అధికారులు నిర్ణయం మేరకు.. తాళం వేసి ఉన్న 22 ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 335 మంది తమకు కేటాయించిన ఇళ్లలో ఉండడం లేదని అధికారులు గుర్తించారు. వారందరికీ నోటీస్‌లు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment