అభిషేక ప్రియనే శరణమయ్యప్ప
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వామియే శరణ మయ్యప్ప.. అభిషేక ప్రియనే శరణమయ్యప్ప.. నామస్మరణతో ఎల్లారెడ్డిపేట మార్మోగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం నుంచి పురవీధుల్లో అయ్యప్ప శోభాయాత్ర నిర్వహించారు. దారిపొడవున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. సాయంత్రం ఆభరణాలు ఊరేగించారు. రాజు, శ్రీను గురుస్వాముల ఆధ్వర్యంలో మహాపడి పూజను సరుగు సాయికుమార్ దంపతులు నిర్వహించారు. బొమ్మకంటి జ్యోతి–భాస్కర్ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు 5వేల లడ్డూలు, అన్నదానం పంపిణీ చేశారు. గురుస్వాములు చకిలం మధు, గోపాల్‌రెడ్డి, కందుకూరి రవి, కొల బాపురెడ్డి, నంది నరేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment