దయచూపని నిర్మలమ్మ!
● ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్టులపై వెలువడని ప్రకటన ● ప్రస్తావనకు రాని బసంత్‌నగర్ విమానాశ్రయం ● ప్రసాద్ స్కీంలో వేములవాడ, కొండగట్టులకు దక్కని హామీ ● రూ.12 లక్షల్లోపు ఆదాయమున్న ఉద్యోగులకు పన్ను ఉపశమనం ● ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు, సింగరేణి కార్మికుల హర్షం ● ఏటా రూ.450 కోట్ల వరకు పన్ను చెల్లిస్తున్న ఉమ్మడి జిల్లా ఉద్యోగులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
కేంద్ర బడ్జెట్ 2025–26లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాజెక్టులు, పెండింగ్ పనుల విషయంలో ఈ ఏడా ది కేంద్రం మొండి చేయి చూపిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రూ.12లక్షల్లోపు ఆదాయమున్న వ్యాపారులు, ఉద్యోగులకు పన్ను మినహాయింపు ప్రకటన మాత్రం మధ్య తరగతికి కాస్త ఊరటనిచ్చే అంశం. ఉమ్మడి జిల్లాలో సింగరేణి, ప్రభుత్వ టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కలుపుకుని దాదాపు 30వేల పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. వీరిలో రూ.లక్షలోపు వేతనం ఉన్న ఉద్యోగులు 95శాతం ఉంటారు. వీరందరికీ కేంద్ర తాజా నిర్ణయం భారీ ఉరట కలిగించింది.
ఉమ్మడి జిల్లా నుంచి రూ.450 కోట్ల పన్ను
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి, విద్యుత్తు ఇతర విభాగాల్లో ఉమ్మడి జిల్లా పరిధిదాదాపు 40వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపుగా ప్రతీ ఉద్యోగి ఆదాయ పన్ను ఏటా చెల్లిస్తున్నారు. వీరితోపాటు పెన్షనర్లు 25 నుంచి 30వేల మంది ఉంటారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి సుమారు రూ.60వేల నుంచి రూ.4లక్షల వరకు పన్నులు కడుతున్నారు. ఉద్యోగుల గణాంకాల ప్రకారం చూస్తే.. సగటున రూ.1.50 లక్షల వరకు పన్ను చెల్లింపులు ఉమ్మడి జిల్లా నుంచి జరుగుతున్నాయి. ఆ లెక్కన చూస్తే.. ఏటా ఉమ్మడి జిల్లా ఉద్యోగులు రూ.450కోట్ల వరకు ఆదాయ పన్నును కేంద్రానికి చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఈ జాబితాలో సుమారు 70శాతం వరకు పన్ను చెల్లించే ఉద్యోగులకు ఉపశమనం కలిగినట్లే.
ఉమ్మడి జిల్లాకు దక్కని ఊరట..
● దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయాన్ని చాలాకాలంగా ప్రసాద్ స్కీంలో చేర్చాలని డిమాండ్ ఉంది. ఇందుకోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, నాయకులు, పార్టీల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఆలయం ప్రసాద్ స్కీంలో చోటు దక్కించుకోలేకపోతుంది. కొండగట్టుకు కూడా కేంద్ర ప్రభు త్వం మొండిచేయి చూపించింది.
● సుదీర్ఘ డిమాండ్లలో ఒకటైన కరీంనగర్‌కు ట్రిపుల్‌ఐటీ, నవోదయా స్కూళ్ల కేటా యింపులో ఈసారి కూడా ఉమ్మడి జిల్లాకు మొండిచెయ్యే దిక్కయింది.
● బసంత్‌నగర్ విమానాశ్రయానికి ఈసారైనా ఉడాన్ స్కీములో చోటు దక్కుతుందని అనుకున్నా.. ఈ విషయంలో కూడా చివరికి నిరాశే మిగిలింది. రాష్ట్రం ఆవిర్భా వం తరువాత ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాశ్రయంగా మార్చే ఆలోచనతో పలుమా ర్లు సర్వే చేసి కేంద్రానికి నివేదిక పంపినా.. ఇంతవరకూ దీనిపై నిర్ణయం వెలువడకపోవడం దురదష్టకరం.
పాత రైల్వే ప్రాజెక్టుల సంగతేంటి?
పాత జిల్లాలో కొత్తపల్లి– మనోహరాబాద్ (148.9 కిమీ.), మణుగూరు –రామగుండం (200 కి.మీ): పెద్దపల్లి బైపాస్– కరీంనగర్ లైన్ (2.169 కి.మీ) పనులు సాగుతుండగా.. హసన్‌పర్తి– కరీంనగర్ (61.8 కి.మీ) రైల్వేలైన్ సర్వే పూర్తయింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇవన్నీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులే. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టులకు ఎంత కేటాయించరన్నది దక్షిణ మధ్య రైల్వే అధికారులు ‘పింక్ బుక్’(బడ్జెట్ కేటాయింపులు) విడుదల చేస్తే తప్ప స్పష్టత రాదు.
Comments
Please login to add a commentAdd a comment