క్యాన్సర్‌పై అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

Published Sun, Feb 2 2025 12:07 AM | Last Updated on Sun, Feb 2 2025 12:07 AM

క్యాన

క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): క్యాన్సర్‌ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని సిరిసిల్ల సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక జైస్వాల్‌ పేర్కొన్నారు. మండలంలోని గోపాలరావుపల్లెలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం క్యాన్సర్‌పై అవగా హన సదస్సు నిర్వహించారు. సీనియర్‌ సి విల్‌జడ్జి మాట్లాడుతూ మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. చింతోజు భాస్కర్‌, వైద్యులు రమేశ్‌, లీలా శిరీష, ఆడెపు వేణు, మల్లేశ్‌యాద వ్‌, ఆంజనేయులు, అన్సార్‌ అలీ పాల్గొన్నారు.

తెలంగాణ భవనాలు అవినీతి గుడారాలు

కేకే మహేందర్‌రెడ్డి

సిరిసిల్లటౌన్‌: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన తెలంగాణ భవనాలన్నీ కేసీఆర్‌ కుటుంబం పదేళ్ల దోపిడీకి గుర్తుగా నిలిచిన అవినీతి గుడారాలని కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల కాంగ్రెస్‌ పార్టీకి లేని ఆస్తులు తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించా రు. ఏడాదిగా ఫాంహౌస్‌లో కుంభకర్ణ నిద్రపోయి ఈరోజు లేచి తన తడాఖా చూపిస్తానంటూ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్‌ భయపడదన్నారు. కూతురు కవితపై కేరళలో లిక్కర్‌ కేసు వెలుగులోకి రావడంతోనే కేసీఆర్‌ నిద్రలేచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని ప్రకటించారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో కేటీఆర్‌ చేసిన అక్రమాలు అంతా..ఇంతా కాదన్నారు. కనిమేని చక్రధర్‌రెడ్డి, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, గంభీరావుపేట ప్రశాంత్‌, కల్లూరి చందన, శరణ్య పాల్గొన్నారు.

ఆర్థికమంత్రి తెలుగులో మాట్లాడడం అభినందనీయం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ: దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌.. అంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలుగులో బడ్జె ట్‌ ప్రసంగాన్ని ప్రారంభించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రూ.12లక్షల వరకు ఆదాయపు పనున్న మినహాయింపు ఇ వ్వడం, 82 వస్తువులపై సెస్‌ తొలగించడం, 36 రకాల క్యాన్సర్‌ మందులు చౌకగా లభించనున్నాయని వివరించారు.

మ్యాక్స్‌ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు

చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్‌

సిరిసిల్ల: సిరిసిల్లలోని మ్యాక్స్‌ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు వచ్చాయని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు మిట్టకోల సాగర్‌ శనివారం తెలిపారు. ప్రభుత్వ వెల్ఫేర్‌ శాఖలకు సంబంధించిన షూటింగ్‌, షర్టింగ్‌, ఓనీ వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు టెస్కో అధికారులు 2025–2026 కోసం ఆదేశాలు జారీ చేశారని వివరించారు. జిల్లాలోని 128 మ్యాక్స్‌ సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్‌లోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో ఉత్పత్తి ప్రణాళికను అందించాలని కోరారు. మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తి సంబంధించి ఎంవోయూ ఆర్డర్‌ కాపీలను పొందాలని సాగర్‌ కోరారు.

నీటి సరఫరా పరిశీలనకు స్పెషల్‌డ్రైవ్‌

సిరిసిల్ల: వేసవిలో నీటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుస్తు ప్రణాళిక సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. ఈమేరకు తాగునీటి సరఫరాలో లోపాలు గుర్తించేందుకు, నీటి సమస్య రాకుండా కార్యాచరణ సిద్ధం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనను ఖరారు చేశారు. ఈనెల 1 నుంచి 12 వరకు స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి? నీటి సరఫరాపై ఆరా తీయనున్నారు. పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ అధికారులతో ఓ బృందాన్ని వేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
క్యాన్సర్‌పై అవగాహన సదస్సు
1
1/1

క్యాన్సర్‌పై అవగాహన సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement