![పల్లెకు చేరిన డ్రోన్ పిచికారీ!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06srl111-180049_mr-1738869015-0.jpg.webp?itok=qokiHSu4)
పల్లెకు చేరిన డ్రోన్ పిచికారీ!
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వ్యవసాయంలో రోజురోజుకు వస్తున్న మార్పులను రైతులు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే యంత్రాల వినియోగం పెరిగిపోగా.. తాజాగా పంటలకు క్రిమిసంహారక మందుల పిచికారీకి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రైతు కుక్కల రాజేందర్ రూ.6లక్షలతో డ్రోన్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌లో నెలరోజులపాటు డ్రోన్ ఆపరేటింగ్‌పై శిక్షణ తీసుకుని పొలాల్లో మందుల పిచికారీ చేస్తున్నాడు. సాధారణంగా అయితే పెట్రోల్ పంపుతో రోజుకు దాదాపు 3 ఎకరాల వరకు క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తుంటారు. దీనికి కూలీకి రూ.1500, నీళ్లు పోసే కూలీకి రూ.500, పెట్రోల్‌కు రూ.150 ఇలా దాదాపు రూ.2,150 ఖర్చు అవుతుంది. అదే డ్రోన్‌తో పిచికారీ చేస్తే మూడు ఎకరాలకు రూ.1500 ఖర్చవుతుంది. అంటే రైతుకు రూ.950 ఆదా అవుతుందని రైతు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment