ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడో?
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారంటీల హామీని మరచిపోయిందన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. సౌల్ల క్రాంతి, బాధ నరేశ్, సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వరి వెంకటేశ్, వెంకన్న, తిరుపతి, బాల్‌రెడ్డి, రమేశ్, రవి, నవీన్, కృష్ణ, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.
వృద్ధులు బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలి
సిరిసిల్లకల్చరల్: వయోవృద్ధులకు అవసరమైన ఆర్థిక సేవలు అందించేందుకు అర్బన్ బ్యాంక్ ముందుంటుందని బ్యాంక్ అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో గత నెలలో సీనియర్ సిటిజన్లకు నిర్వహించిన క్రీడాపోటీల్లోని విజేతలకు గురువారం బ్యాంక్ ప్రాంగణంలో బహుమతులు అందజేశారు. సీనియర్ సిటిజన్ సంఘం ప్రతినిధులు చేపూరి బుచ్చ య్య, జనపాల శంకరయ్య పాల్గొన్నారు.
కోలుకుంటున్న నయనశ్రీ
వీర్నపల్లి(సిరిసిల్ల): క్యాన్సర్‌తో బాధపడుతున్న మండలంలోని గర్జనపల్లికి చెందిన గజ్జల నయనశ్రీ ఆరోగ్యం మెరుగవుతుందని డాక్టర్ స్నేహ తెలిపారు. నయనశ్రీ చికిత్స కోసం కలెక్టర్ రూ.10లక్షలు మంజూరు చేయగా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం మండల వైద్యాధికారి స్నేహ, తహసీల్దార్ మారుతిరెడ్డి చిన్నారి ఇంటికెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
అనంతారంలో ఆకస్మిక తనిఖీ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని అనంతారం జీపీ కార్యాలయంలో డీఆర్డీవో, ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలోని శానిటేషన్, సమ్మర్ యాక్షన్ ప్లాన్, నర్సరీ తదితర రికార్డులు పరిశీలించారు. ఎంపీవో సంధ్య, సెక్రెటరీ విజయలక్ష్మి ఉన్నారు.
మున్సిపల్ పన్నులు చెల్లించాలి
సిరిసిల్లటౌన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, గతంలో చెల్లించని పన్నులు వెంటనే చెల్లించాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎస్.సమ్మయ్య ప్రకటనలో తెలిపారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో మాదిరి గానే ప్రజలు పన్నుల చెల్లింపులో మున్సిపల్‌ను మొదటిస్థానంలో నిలపాలని కోరారు.
రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి
సిరిసిల్లటౌన్: ఏళ్లుగా సేవలందిస్తున్న రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. కాంట్రాక్టు బేసిక్‌లో పనిచేస్తు న్న వారికి రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరా రు. ఉద్యోగ భద్రత, రూ.10లక్షల లైఫ్‌టైమ్ గ్రాట్యుటీ, రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్,7 నెలల పీఆర్సీ ఏరియర్స్ వేతనం ఇవ్వాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, రెండో ఏఎన్‌ఎంలు స్వప్నదేవి, వినోద, మంజుల, సరిత, పుష్పలత, రాజేశ్వరీ, పూజిత, సువర్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment