![నేతన్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06srl02-180076_mr-1738869042-0.jpg.webp?itok=KWry_dy4)
నేతన్నలకు ‘చేయూత’
మరమగ్గాలు నడుపుతున్న ఇతను కోడం బాలకిషన్(62). సిరిసిల్ల విద్యానగర్‌లోని ఓ కార్ఖానాలో 12 సాంచాలపై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.8వేలు సంపాదిస్తున్నాడు. నిత్యం సాంచాల మధ్య 10 గంటలపాటు పని చేస్తేనే బాలకిషన్‌కు ఈ కూలీ లభిస్తుంది. బాలకిషన్ నెలకు రూ.1,200 చొప్పున త్రిఫ్ట్ పొదుపు పథకంలో చెల్లిస్తున్నాడు. ప్రభుత్వం అంతే మొత్తంలో మరో రూ.1,200 బాలకిషన్ బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. ఈ మొత్తం డబ్బులు 36 నెలల తర్వాత వడ్డీతో సహా బాలకిషన్ తీసుకునే అవకాశం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు చేనేత ‘అభయహస్తం’ పథకంలో 24 నెలలకే పొదుపు చేసుకున్న సొమ్ము, ప్రభుత్వం జమచేసిన సొమ్ము మొత్తం కలిపి వడ్డీతో సహా తీసుకునే వెసులుబాటును కల్పించింది.
ఇతను భీమనాతిని కొమురయ్య(80). జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన కొమురయ్య 60 ఏళ్లుగా చేనేత మగ్గం నడుపుతున్నాడు. చేనేత మగ్గంపై కాటన్‌వస్త్రాన్ని నేస్తే మీటరుకు రూ.28.50 ఇస్తారు. రోజంతా నాలుగు, ఐదు మీటర్ల బట్టను నేసి రూ.114 నుంచి రూ.142 సంపాదిస్తారు. కొమురయ్య భార్య శంకరవ్వకు చేతకాదు. నడుం వంగిపోయింది. ఆయనకు ముగ్గురు కొడుకులు. కొమురయ్యకు బీమా భద్రత లేదు. ఆయన వయసు 80 ఏళ్లు కావడంతో ఎల్‌ఐసీ సంస్థ అతనికి బీమా చేసేందుకు నిరాకరిస్తుంది. కానీ ప్రభుత్వం చేనేత ‘అభయహస్తం’లో వయసుతో సంబంధం లేకుండా చేనేతవృత్తిలో ఉన్న అందరికీ బీమా కల్పిస్తుంది. కొమురయ్య కుటుంబానికి కొత్తగా బీమా ధీమా లభిస్తోంది.
![నేతన్నలకు ‘చేయూత’1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06srl03-180076_mr-1738869042-1.jpg)
నేతన్నలకు ‘చేయూత’
Comments
Please login to add a commentAdd a comment