● చేనేత, జౌళిశాఖ ఏడీ సాగర్
సిరిసిల్ల: నేతన్నలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం టెస్కో ద్వారా వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వస్త్రాలను ఈనెల 10 నుంచి సేకరించనున్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు అందించే డ్రెస్‌లకు సంబంధించి వస్త్రోత్పత్తి ఆర్డర్లను నేతన్నలకు ప్రభుత్వం గత నవంబరులో అందించింది. స్థానికంగా ఉన్న 128 మ్యాక్స్ సంఘాలకు 65లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చింది. గత మూడు నెలలుగా షూటింగ్, షర్టింగ్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. మ్యాక్స్ సంఘాల్లో ఉత్పత్తి అయిన బట్టను స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) గోదాములో ఈనెల 10 నుంచి సేకరించనున్నారు. బట్టను సిద్ధం చేసిన మ్యాక్స్ సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్‌లోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో సంప్రదించాలని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు మిట్టకోల సాగర్ తెలిపారు. టీం రిపోర్టు పొందిన వస్త్రాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment