సీఎంను కలిసిన గోలి శ్రీనివాస్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన గోలి శ్రీనివాస్‌రెడ్డి

Published Mon, Sep 4 2023 6:08 AM | Last Updated on Mon, Sep 4 2023 6:08 AM

- - Sakshi

ఆమనగల్లు: రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరా బాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌గా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన నియామకం

షాద్‌నగర్‌రూరల్‌: జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా షాద్‌నగర్‌ పట్టణానికి చెంది వెంకన్నబాబును నియమించారు. ఈ మేరకు జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మెహతాబ్‌రాయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జాతీయ మానవ హక్కులు, సామాజిక న్యాయ సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుక్కాడానియల్‌ చేతుల మీదుగా వెంకన్నబాబు నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్నబాబు మాట్లాడుతూ.. తనకు ఈ పదవి లభించడానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ డానియల్‌, రాష్ట్ర చైర్మన్‌ వేణుమాధవ్‌, సర్వేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు శీలం సరస్వతి, వైస్‌ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌లోండే, రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ ఉపేందర్‌, రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పురస్కార ప్రదానం

షాద్‌నగర్‌: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్మారక పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యారంగాభివృద్ధికి కృషి చేస్తున్న షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన యువ కవి, ఉపాధ్యాయుడు రవిప్రకాష్‌ హర్మాళ్‌ సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు షేక్‌జానీ, ప్రధాన కార్యదర్శి కత్తుల హరిత చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రవిప్రకాష్‌కు అభినందనలు తెలిపారు.

ముస్లిం మతపెద్దలతో

మంత్రి సబిత భేటీ

పహాడీషరీఫ్‌: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం మంత్రి సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ఇమాం, మోజంలతో పహాడీషరీఫ్‌లోని ప్రీమియర్‌ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింల అభ్యున్నతికి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ ఐదేళ్ల కాలంలో ముస్లిం బస్తీల్లో చేసిన అభివృద్ధిని వివరించారు. లౌకికవాదం ముసుగులో వచ్చే పార్టీలను నమ్మొద్దన్నారు. మున్ముందు కూడా ముస్లిం మైనార్టీలకు సీఎం కేసీఆర్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వెంకన్నబాబుకు నియామకపరత్రంఅందజేస్తున్న డాక్టర్‌ డానియల్‌  
1
1/2

వెంకన్నబాబుకు నియామకపరత్రంఅందజేస్తున్న డాక్టర్‌ డానియల్‌

పురస్కారాన్ని అందుకుంటున్న రవిప్రకాష్‌ హర్మాళ్‌ 
2
2/2

పురస్కారాన్ని అందుకుంటున్న రవిప్రకాష్‌ హర్మాళ్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement