రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మంచాల: అతి వేగం ఓ యువకుడిని బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మంచాల మండలంలోని లింగంపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కడీలబావి తండాకు చెందిన కారంటోత్ మహేశ్(23) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. ఆయన సాయంత్రం ఇబ్రహీంపట్నం నుంచి మంచాల వైపు బైక్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో లింగంపల్లి గేట్ వద్దకు రాగానే కోళ్ల ఫారానికి దాణా తీసుకెళ్తున్న ఓ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. అతివేగం కారణంగా తలకు బలమైన గాయం కావడంతో మహేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment