రేషన్ బియ్యం పక్కదారి
కొందుర్గు: ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసిన మరుసటి రోజే వాటిని కొనడానికి దళారుల వాహనాలు గ్రామాలకు చేరుకుంటాయి. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని పలుమార్లు పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదని వాపోతున్నారు. ఈ ఏడాది నవంబర్ 5న రేషన్ తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని సీజ్ చేశారు. 100 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి దళారులు లాభార్జనకు పాల్పడుతున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యం మండలంలోని చిన్నఎల్కిచర్ల, పుల్లప్పగూడ గ్రామాల్లో నిల్వచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామాల్లోనే పలుమార్లు బియ్యం పట్టుబడ్డాయని అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
కేసులు నమోదైనా మారని దళారుల తీరు
Comments
Please login to add a commentAdd a comment