ఆటో బోల్తా.. వ్యక్తి దుర్మరణం
మొయినాబాద్: ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సురంగల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్ల ప్రవీన్‌కుమార్ అలియాస్ పెంటయ్య(41) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో మొయినాబాద్ నుంచి సురంగల్ వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో ఆటోను రోడ్డు దింపాడు. అనంతరం రహదారిపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. ప్రవీన్ ఆటో కింద పడటంతో తల, పొట్ట భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వచ్చి చికిత్స కోసం అతన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సురంగల్‌లో ప్రమాదం
కేసు నమోదు చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment