ముగిసిన
కై ట్ ఫెస్టివల్
కంటోన్మెంట్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వీట్స్, కై ట్స్ ఫెస్టివల్ బుధవారం ఘనంగా ముగిసింది. మూడు రోజుల్లో సుమారు 15 లక్షల మంది సందర్శించినట్లు అంచనా. ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, కాంబోడియా, థాయ్‌లాండ్, సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, ఇటలీ, ట్యునీషియా, సౌత్ ఆఫ్రికా, పోలండ్, సింగపూర్, ఉక్రెయిన్, ఫ్రాన్స్ దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ కై ట్ ఫ్లయర్స్, 13 రాష్ట్రాలకు చెందిన 50 మంది దేశీయ కై ట్ ఫ్లయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. చిరుత, చింపాంజీ, ఈగల్, పులి, పాము, టెడ్డీ, రోబోట్, సన్‌ఫ్లవర్, డోరీమాన్ చిన్నారులతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ల చేతుల మీదుగా ఈ నెల 13న ప్రారంభమైన కై ట్స్, అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌ను 14, 15వ తేదీల్లో పలువురు వీఐపీలు సందర్శించారు. సంక్రాంతి రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ కై ట్ ఫెస్టివల్‌లో పాల్గొని స్వయంగా పతంగులు ఎగురవేసి సందడి చేశారు. బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ బృందం ఆలపించిన గీతాలు శ్రోతలను అలరించాయి. స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో 1,200 రకాలకుకై మిఠాయిలు ఆహార ప్రియులను చవులూరించాయి. ముగింపు కార్యక్రమంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, సాంస్క ృతిక సారథి వెన్నెల, నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment