ప్రశాంతతకు నిలయం కన్హా
నందిగామ: కన్హా శాంతివనం ప్రశాంతతకు నిలయంగా రూపు దిద్దుకుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కన్హాను సందర్శించారు. శాంతివనం ప్రత్యేకతలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. నిత్యం అనేక రకాల ఒత్తిడులతో ఇబ్బంది పడేవారికి రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్హా శాంతి వనం మానసిక ప్రశాంతతను చేకూరుస్తోందని తెలిపారు. నిరంతర ధాన్యంతో అనేక రుగ్మతలు దూరమవుతాయన్నారు. ఏక కాలంలో లక్ష మంది ధ్యానం చేసుకునేలా గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment