ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఐ నాగరాజు
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో ఓ స్థల వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. మంగళవారం జోగిపేట సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని సర్వేనెంబర్ 174లోని భూమిలో చాలా కాలంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. ఆ స్థలంలో పట్టణానికి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్‌పీ సయ్య మహేష్, అతని కుమారుడు తేజ ఆ స్థలంలో నిర్మాణం చేపడుతుండగా హనుమంతరావుపేట సంపత్ గౌడ్, సాయినాథ్ గౌడ్‌లు పని నిలిపివేయాలని వారిని కోరారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. డీఎస్‌పీ మహేష్ కుమారుడు తేజ సంపత్, సాయినాథ్‌పై దాడి చేయడంతో తలకు, కాలు, చేయి, దవడకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేజను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ నాగరాజు పరిశీలించారు.
పరస్పరం ఫిర్యాదులు
డీఎస్‌పీ సయ్య మహేష్, అతని కొడుకు తేజా తమపై ఇనుప రాడ్డు, నేకల్ పంచుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని రామాగౌడ్ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై కూడా రామా గౌడ్, ప్రవీణ్ గౌడ్, సంపత్ గౌడ్, ప్రదీప్ గౌడ్‌లతోపాటు పదిమంది దాడి చేసినట్లు సయ్య మహేష్ న్యాయవాది ద్వారా జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాలపై హత్యాయత్నం కేసు
జోగిపేటలో భూ వివాదానికి సంబంధించి జరిగిన ఘర్షణలో ఇరువర్గాలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు జోగిపేట ఎస్‌ఐ–2 జయశంకర్ తెలిపారు. సంపత్‌గౌడ్, సాయినాథ్‌గౌడ్‌లపై దాడి జరిపిన కేసులో తేజ, డీఎస్‌పీ మహేష్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. డీఎస్‌పీ మహేష్ చేసిన ఫిర్యాదుతో నలుగురితో పాటు మరికొంతమందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు పేర్కొన్నారు.
సాయినాథ్ గౌడ్
గాయపడ్డ సంపత్
నలుగురికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment