సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రధాన పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పష్టం చేశారు. చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్, సరాఫ్ పల్లి గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించి, సర్వే బృందాల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...సర్వేలో తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సుల్తాన్పూర్, సరాఫ్ పల్లి గ్రామాలలో కలెక్టర్ స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి పరిస్థితులను సమీక్షించారు. సర్వే బృందాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, తగిన సూచనలు చేశారు. కలెక్టర్ క్రాంతి వెంట అందోల్ ఆర్డీవో పాండు, తహసీల్దార్ కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment