అక్రమ లేఆఫ్‌ను రద్దు చేయాలి
● యూబీ పరిశ్రమ నిర్ణయంపై
ఉద్యమిస్తాం
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కొండాపూర్ మండలంలోని యూబీ పరిశ్రమ ప్రకటించిన అక్రమ లేఆఫ్‌ను వెంటనే రద్దు చేయాలని లేకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు హెచ్చరించారు. యూబీ పరిశ్రమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ కార్మికులు శుక్రవారం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఏవో, డీసీఎల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ యూబీ యాజమాన్యంకు ప్రభుత్వం నుంచి రావలసిన రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదన్నారు. మద్యం రేట్లు పెంచడం లేదని ఆకస్మికంగా ఈనెల 8నుంచి ఉత్పత్తి నిలిపివేసిందని తెలిపారు. పర్మినెంట్ కార్మికులకు లేఆఫ్ ప్రకటించడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం చర్చించుకోవాల్సిన అంశాలను కార్మికుల మీద రుద్ది, వారిని రోడ్డుపాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పరిశ్రమ ఉత్పత్తులు నిలిపివేయడంతో 2,000 మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డుమీద పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment