సర్వే ప్రక్రియను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
ఝరాసంగం(జహీరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల సర్వే పకడ్బందీగా చేపట్టాలని ట్రైనీ కలెక్టర్ మనోజ్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని చిలపల్లి, ఎల్గోయి, చిలమామిడి, గుంతమర్పల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సర్వే కార్యక్రమం కొనసాగింది. పలు గ్రామాల్లో ట్రైనీ కలెక్టర్ సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టాలన్నారు. ఇక మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి పర్యటించి, సర్వే ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమలరావు, మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్, అధికారులు రామారావు, నర్సింలు, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment