రాజకీయాల్లో మార్పులు అవసరం | - | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో మార్పులు అవసరం

Published Sat, Jan 18 2025 10:12 AM | Last Updated on Sat, Jan 18 2025 10:12 AM

రాజకీయాల్లో మార్పులు అవసరం

రాజకీయాల్లో మార్పులు అవసరం

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రావాల్సిన అవసరముందని, ఆ దిశగా సంగారెడ్డిలో జరగబోయే సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగవ మహాసభల్లో సమరశీల పోరాట కర్తవ్యాలను రూపొందించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్‌ భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేళ్లు, బీజేపీ పదేళ్లు, కాంగ్రెస్‌ 13 నెలలు పాలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూశాయని ఏనాడూ వారిని ప్రజలుగా గుర్తించలేదన్నారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు దోహదపడే ఏ ఒక్క మంచి నిర్ణయం, పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కోటీ 30 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పైగా కేంద్రంలోని ప్రధాని మోదీ మాత్రం రోజుకు రూ.178 రూపాయల వేతనం సరిపోతుందంటూ జీవో జారీ చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు నయాపైసా సాయం చేయలేదన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు అవి అందని ద్రాక్షలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న జరిగే బహిరంగ సభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌, బృందాకరత్‌, బీవీరాఘవులు, విజయరాఘవన్‌తోపాటు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీసభ్యులు చెరుపల్లి సీతారాములు, నాగయ్య, బి.వెంకట్‌, సాయిబాబు వంటి వారు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు, జ్యోతి, పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పాల్గొన్నారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

వీరయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement