కుటుంబ కలహాలతో కెనాల్‌లో దూకిన మహిళ
సిద్దిపేటకమాన్: కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఇద్దరు యువకులు కాపాడారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సిద్దిపేట డబుల్ బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్న చాంద్ బీ(46) అనే మహిళ హైదరాబాద్‌లో ఉండే తన కుమారుడితో డబ్బుల విషయంలో గొడవ పడింది. సోమవారం రాత్రి ఇదే విషయంపై గొడవ జరుగగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం రంగనాయక్ సాగర్ కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. నీటిలో మునుగుతున్న మహిళను గుర్తించిన స్థానిక ఇద్దరు యువకులు వ్యవసాయ బావికి వినియోగించే ప్లాస్టిక్ పైపు సాయంతో కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు.
పైపు సాయంతో కాపాడిన స్థానిక యువకులు
సిద్దిపేట పట్టణ శివారులో ఘటన
Comments
Please login to add a commentAdd a comment