గుమ్మడిదల మున్సిపాలిటీ వద్దు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదలను మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం గుమ్మడిదల మండలంలో ఉన్న బొంతపల్లి జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, ప్రజలు, రైతులు ఆందోళన నిర్వహించారు. మున్సిపాలిటీగా మారిస్తే పన్నుల భారాన్ని ప్రజలు భరించలేరన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేసి ఇక్కడి నుంచి పంపించి వేశారు. ఆందోళన నేపథ్యంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అయితే పోలీసులు చొరవ తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేయగా తమ గమ్య స్థానాలకు పయనమయ్యారు. కార్యక్రమంలో స్థానిక అఖిలపక్ష నాయకులు, రైతులు, యువకులు పాల్గొన్నారు.
అఖిల పక్షం నేతల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment