బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు
● గంజాయి, గుడుంబాకు అడ్డాగా తెలంగాణ ● శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి బీఆర్‌ఎస్ కార్యకర్తలపై, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కంటే ఈ ప్రభుత్వంలో ఈ ఏడాది ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే సుమారు వెయ్యి కేసులు పెరిగాయన్నారు. 2022లో జిల్లాలో 6,429 కేసులు నమోదైతే, 2024లో 7,563 కేసులు నమోదయ్యాయన్నారు. మహిళలపై అత్యాచారాల కేసులు 31% పెరిగాయని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ కేసులు పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. హోంమంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఫల్యమేనన్నారు. గంజాయి, గుడుంబాకు తెలంగాణ అడ్డాగా మారిందని అన్నారు.
మహాపడి పూజకు హాజరైన హరీశ్
సదాశివపేట(సంగారెడ్డి): అయ్యప్పస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జీవించాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టణంలో జరిగిన మహాపడిపూజతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ 29వ ఇరుముడి, షష్టిపూర్తి తులాభారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అయ్య ప్ప స్వాములు ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, జెడ్పీ మాజీ చైర్మన్ మంజూశ్రీ, బీఆర్‌ఎస్ నాయకులు పట్నం మాణిక్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment