క్రీడల అభివృద్ధికి సహకారం
పటాన్‌చెరు/రామచంద్రాపురం(పటాన్‌చెరు): క్రీడలు దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నూతన సంవత్సరం సందర్భంగా నిరంజన్ ఎలెవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. పటాన్‌చెరు, అమీన్‌పూర్, జిన్నారంలో ఐదు ఎక రాల విస్తీర్ణంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం విజేతలుగా నిలిచిన నిరంజన్ 11, కేబీఎన్ జట్లకు ట్రోఫీలు అందజేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల అభివృద్ధికి కృషి
రిటైర్డ్ ఉద్యోగస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రామచంద్రాపురం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరం 2025 క్యాలెండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment