పంట చేలల్లో ఘనంగా పూజలు
కంగ్టి/నారాయణఖేడ్: నారాయణఖేడ్ ప్రాంతంలో సోమవారం శూన్యం అమావాస్య వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాల్లోని రైతులంతా పొలాల బాట పట్టారు. పుష్యమాసం ప్రారంభంలో వచ్చే అమావాస్య రోజున రైతులు రబీలో పండిన పంటలైన శనగ, కంది, బటానీ, కాయగూరలతో బజ్జికూరను ప్రత్యేకంగా తయారు చేస్తారు. పొలాల్లో గుడిసెలు వేసి అందులో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి పంట సరుకులు, నైవేద్యంతో పూజిస్తారు. పాడిపంటలతో తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. అనంతరం ప్రత్యేకంగా వండిన అంబలి, బజ్జికూర, జొన్న రొట్టెలు తదితర వంటలను బంధుమిత్రులతో కలిసి ఆరగిస్తారు.
కంగ్టి: బాన్సువాడ గ్రామ శివారులో పంట చేలల్లో పూజలు చేస్తున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment