బైపాస్‌రోడ్లతో ట్రాఫిక్‌కు చెక్
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణం అభివృద్ధి చెందడంతోపాటు ట్రాఫిక్ సమస్యల నివారణ, చుట్టు ప్రక్కల మండలాల్లోని జనాలకు మేలు చేకూరేందుకు బైపాస్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ శివార్లలోని చాంద్‌ఖాన్‌పల్లి నుంచి కంగ్టి రోడ్డుకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పట్టణంలో రోజు రోజుకు జనాభా పెరుగుతున్నందున రానున్న రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రోడ్లు ఉపయోగ పడతాయని, చుట్టుప్రక్కల గ్రామాల వారికి మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే కరస్‌గుత్తి రోడ్డు నుంచి కంగ్టి రోడ్డుకు బైపాస్ నిర్మాణం వేగంగా జరుగుతున్నాయన్నారు. చాంద్‌ఖాన్‌పల్లి నుంచి ఖాంజీపూర్ వరకు అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు లింక్‌రోడ్లను నిర్మిస్తామని అన్నారు. ప్రజలు అభివృద్ధి పనుకలు సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్‌సేట్, కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు రాజేష్ చౌహాన్, మూఢ రామకృష్ణ, నాయకులు వినోద్‌పాటిల్, పండరీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో సుడిగాలి పర్యటన
పట్టణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరిశీలించారు. ఖేడ్, మంగల్‌పేట్‌లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఖేడ్, మనూరు, నిజాంపేట్, కల్హేర్ మండలాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నిర్మాణం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment